Apr 18, 2015

త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టారు!

కాశ్మీర్ లో వేర్పాటు వాదులు రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం వేర్పాటు వాద నేతల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన అగంతకులు.. ఇప్పుడు మరో ర్యాలీలో ఏకంగా భారతీయ జాతీయ పతాకాన్ని తగలబెట్టారు! మొహాలకు ముసుగులను ధరించిన అగంతకులు త్రివర్ణ పతాకానికి నిప్పు పెట్టి కాళ్లతో తొక్కి తమ కసిని చల్లార్చుకొన్నారు. వేర్పాటు వాద నేతలు మస్రత ్ ఆలం అరెస్టుకు నిరసనగా... అంతకు ముందెప్పుడో సైన్యం చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించడానికి నిరసనగా చేపట్టిన ర్యాలీలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారు ఉగ్రవాదులేనని సైన్యం స్పష్టం చేస్తోంది. దీంతో స్థానిక వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. ర్యాలీగా వచ్చి పోలీసులపై రాళ్ల దాడులు చేశారు. భద్రతాదళాలు కూడా వీరిని ధీటుగా ఎదుర్కొన్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొత్తానికి కాశ్మీర్ లో పరిస్థితి మరోసారి పరిస్థితి దిగజారింది. ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున à°"టింగ్ లో పాల్గొన్నారు.. వేర్పాటు వాద శక్తుల ప్రభావం తగ్గిపోయింది అనుకొంటే.. వేర్పాటు వాదులకు, ఉగ్రవాదులకు థ్యాంక్స్ చెప్పే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి మళ్లీ మామూలే అయ్యింది.జైళ్ల నుంచి వేర్పాటు వాద నేతలను విడిచి పెట్టి ప్రశాంతమైన పరిస్థితులు కల్పిస్తామన్న ప్రభుత్వాలే.. ఇంతటి ఉద్రిక్త పరిస్థితులకు కారణమని చెప్పవచ్చు 

No comments:

Post a Comment